ఏపీలో కరోనా పరీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి .అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.మరణాలు కూడా అదికం అవుతున్నాయి.
గత ఇరవై నాలుగు గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
కరోనా బారిన పడి ఈ రోజు 10 మంది మరణించారు దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 129కు చేరింది. ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
4,779 మంది కరోనా బాధితులు కోలుకున్నారని ఆరోగ్యశాఖ బులెటిన్ లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో46.26 శాతం రికవరీ రేటుగా ఉంది. 10లక్షల మందికి సగటున 14,049 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.