చైనాపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. లక్షల మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్… చైనాలోనే పుట్టింది…
ఆ దేశమే ఆ వైరస్‌ని అంటించిందని చాలా మంది ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఇండియన్స్ విషయంలో చైనా చేస్తున్న దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా సరిహద్దుల్లో మన భారత జవాన్లను పొట్టన పెట్టుకున్న చైనాపై భారతీయులు ఆగ్రహావేశాలతో ఉన్నారు.
ఇలాంటి సమయంలో వచ్చిన ఫాదర్స్ డే సందర్భంగా… ఈనాడులో వచ్చిన కార్టూన్… చైనాకి సరైన చెంప పెట్టు అంటున్నారు నెటిజన్లు. ఈ కార్టూన్ కరెక్టుగా సెట్టైందని చెబుతున్నారు.