Home / SLIDER / అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి హరీశ్ రావు

అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు – మంత్రి హరీశ్ రావు

ప్రపంచాన్ని వ్యాధులు వణికిస్తున్నాయి. మానవ మనుగడను సవాల్ చేస్తున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశం. యోగా జీవితంలో ఒక భాగం కావాలి. ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చు.

నేను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సిద్ధిపేట జిల్లాలో యోగాను గతేడాది నుంచి అన్నీ వర్గాల ప్రజల్లో, పాఠశాలల్లో క్రియాశీలకంగా ప్రవేశపెట్టి మంచి సత్ఫలితాలను సాధిస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యోగా సాధన మీరు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రోగ నిరోధక శక్తి తప్పక పెరుగుతుందని, ఎలాంటి వ్యాధులైనా.. ఎదుర్కొనే శక్తి లభిస్తుందని., ఏలాంటి ఖర్చు లేకుండా ఉన్న యోగాను అందరూ సాధన చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని ప్రజలను కోరారు. మిమ్మల్ని అందరినీ యోగా సాధనకు సాదరంగా ఆహ్వానిస్తున్నానని యోగ చేద్దాం.. ఆరోగ్య తెలంగాణగా మార్చుదామని మంత్రి హరీశ్ ప్రజలకు పిలుపు నిచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat