ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామన్నారు.
విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు.
దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.