తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారంతో రాష్ట్రం ఆకుపచ్చని తెలంగాణగా మారుతున్నదని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర రిజర్వు ఫారెస్ట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామ ని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కీసర ఆధ్యాత్మిక శైవక్షేత్రంగా కీర్తి గడిస్తున్నదని, భవిష్యత్‌లో ఆధ్యాత్మికతతోపాటు ఆకుపచ్చని ఆహ్లాదాన్ని పంచే నందనవనంగా మారుతుందని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్-3లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో కలిసి శుక్రవారం తూంకుంట, బిట్స్ పిలాని, కీసర రిజ ర్వు ఫారెస్ట్‌లో ఎంపీ మొక్కలు నాటారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు రాఘవ పాల్గొన్నారు.