సోమవారం సీఎం కేసీఆర్ సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వ సాయాన్ని కేసీఆర్ అందజేయనున్నారు.
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్‌బాబుబాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. దీంతోపాటు నివాస స్థలం, సంతోష్‌బాబు భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. తానే స్వయంగా వారి ఇంటికి వెళ్లి సాయం అందజేస్తానన్నారు. ఆయన అన్నట్లుగానే సోమవారం సూర్యాపేటకు వెళ్లనున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల సూర్యాపేట కరోనా ప్రబలిన నేపథ్యంలో కోవిడ్ నింబంధనల మేరకే కేసీఆర్ పర్యటనను అధికారులు ఖరారు చేశారు.