ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ఖానపురం రోడ్ లో రూ.3.75 కోట్లతో నిర్మించిన రెండు వైపులా డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్, నూతన బ్రిడ్జి, సైడ్ డ్రైన్ ను మేయర్ పాపాలాల్ గారితో కలిసి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ .
ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నడూ లేని విధిగా కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందర నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
ఇరుకైన రోడ్లు లేకుండా ఇప్పటికే అన్ని రోడ్లను విస్తరించి ఇరు వైపులా డబుల్ రోడ్లతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లు విస్తరించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలో మోడల్ నగరంగా నిలిచిందన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ ను ఆదర్శంగా తీసుకునే స్థాయికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి గారు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి గారు, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, ఏ హనుమాన్, నాయకులు మున్సిపల్ డిఈ లు, ఏఈ లు ఉన్నారు.