కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్ లోకో పైలట్స్ (ఏఎల్పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది.
10123 మంది ఏఎల్పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.