తుముకుంట మున్సిపాలిటీ పరిధిలో మరియు కీసరలో దత్తత తీసుకున్న ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది .. మొక్కలు నాటే యజ్ఞం ప్రారంభమైంది , అందులో భాగంగా ఈరోజు తుముకుంట మున్సిపాలిటీ పరిధిలోని బిట్స్ పిలానీ వద్ద మరియు తాను దత్తత తీసుకున్న కీసరగుట్ట లో మంత్రి మల్లారెడ్డి ఇతర నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.
గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జైత్రయాత్ర కొనసాగుతుంది . ప్రకృతి పచ్చదనం తో మానవాళికి స్వచ్చ మైన గాలి అందించాలి అనే దృఢసంకల్పంమే ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయానికి నిలువుటద్దం . మొక్కలు నాటిన తర్వాత కీసర రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించడం జరిగింది.
ఆలయ ప్రాంగణంలో ఉసిరి మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమం లో మంత్రి మల్లా రెడ్డి గారు , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు , ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్ గారు మాధవరం కృష్ణారావు గారు , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మర్రి రాజశేఖర్ రెడ్డి ,ZP చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి; కో ఫౌండర్ రాఘవ ; కిషోర్ గౌడ్. స్థానిక మున్సిపల్ చైర్మన్లు ; సర్పంచ్ లు; ప్రజా ప్రతినిధులు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు .