ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను ఆయనకు వివరించారు.
వైకాపా పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూలదోసే దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ 14 పేజీల లేఖను గవర్నర్‌కు ఇచ్చారు.
తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దళితులపై దాడులు, దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాల జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
4 రోజుల్లో ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.