నెపాటిజం అంటే బంధుప్రీతి. తమ వాళ్లకు అవకాశమిచ్చి.. ఇతరులను అణగదొక్కడం! బాలీవుడ్‌లో కొనసాగుతున్నఈ ధోరణే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్ ఫేక్‌స్టార్స్..
బాయ్‌కాట్ బాలీవుడ్.. నెపాటిజమ్ కిల్స్ సుశాంత్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు. బాలీవుడ్‌లో అగ్రశేణి నటులకున్న విలువ స్వయంకృషితో ఎదిగిన యాక్టర్స్‌కు లేదని, బాలీవుడ్ సినిమాలు చూడడం ఆపేసి, వెబ్ సిరీస్, టాలీవుడ్, హాలీవుడ్ ఫిల్మ్స్ చూడడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.
కరణ్ జోహార్, ఖాన్స్, భన్సాలీ, టీ సిరీస్ కలిసి సుశాంత్‌కు ప్రాధాన్యం లేకుండా చేశారని, సుశాంత్ నటించిన దిల్ బేచారాకు కాకుండా చెత్త సినిమా గల్లీ బాయ్స్‌కు అవార్డు ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ అని ఒకరు ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో సుస్మితాసేన్ నెపాటిజం బాధితురాలేనని మరొకరు గుర్తుచేశారు.
అలాగే, సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలపై ధైర్యంగా మాట్లాడిన హీరోయిన్ కంగనా రనౌత్‌కు పలువురు ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు. కాగా, సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో నెపాటిజం అనేది తెరపైకి వచ్చింది. ఈ పదం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.