ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
ఆయన లాక్డౌన్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు.
భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసుల నమోదు చేశారు.