ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు.
జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు.
జేసీ కుటుంబానికి ట్రావెల్స్ వ్యాపారం కొత్తకాదని తెలిపారు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్.. ఏపీ ప్రజలందరితో చిప్పకూడు తినిపించాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. తొందర్లోనే తిరగబడే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రభాకర్‌రెడ్డిపై ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. జేసీ ప్రభాకర్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్థిక నేరస్తుడు కాదన్నారు. బడుగు, బలహీనవర్గాలపైన కూడా కేసులు పెడుతున్నారని తెలిపారు. మాకేం కాలేదులే అని ప్రజలు ఊరుకుంటే.. రేపు ఈ గజదొంగలు మీపైన కూడా పడతారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.