తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 191కరోనా కేసులు నమోదు అయ్యాయి.వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,111కి చేరుకుంది.అయితే గడిచిన ఇరవై నాలుగంటల్లో నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 143కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో కరోనాతో నిన్న ఒక్కరోజే ఎనిమిది మంది మృతి చెందారు.మొత్తం 156మంది ఇప్పటివరకు కరోనా భారీన పడి మృతి చెందారు.తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసులు 2138గా ఉన్నాయి.మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1817మంది…
నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో బుధవారం కొత్తగా 191 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 143, మేడ్చల్ 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్‌నగర్ 4, జగిత్యాల 3, మెదక్ 3, నాగర్‌కర్నూల్ 2, కరీంనగర్ 2, నిజామాబాద్, వికారాబాద్, నల్లగొండ, సిద్దిపేట ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.