తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఫాం హౌజ్ అని రేవంత్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు బెంచ్. ఆధారాలు చూడకుండానే ఎన్జీటీ నోటీస్ జారీ చేయడం సబబు కాదు అని ఆ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు.
ఆ భూమి సరిహద్దులు కూడా చూడకుండా, యాజమాన్య హక్కులు, పత్రాలు పరిశీలించకుండా కేవలం ఎవరో పిటిషన్ వేస్తే, గూగుల్ మ్యాప్ లో పేర్లు రాస్తే సరిపోతుందా అని తీవ్రంగా ప్రశ్నించిన బెంచ్.
భూమి యాజమాన్యం కూడా చూడకుండా రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ఫిర్యాదు తీసుకుని ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన మంత్రి కేటీఆర్. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది అని అన్న కేటీఆర్
ఇది రాజకీయ కక్షపూరిత పిటిషన్, రేవంత్‌పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఫాంహౌజ్ నాది కాదని స్పష్టం చేసి హైకోర్టుకు నివేదించిన కేటీఆర్.
నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వలు ఇవ్వడాన్ని సవాల్ చేసిన కేటీఆర్.
కేటిఆర్ పిటిషన్ పై స్పందించి, ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.
ఎన్జీటీ నోటీస్ పై తక్షణం స్టే విధించిన హైకోర్టు బెంచ్.
దీంతో రేవంత్ ఇన్నాళ్లు చేసిన ఆరోపణలు అబద్ధం అని ప్రాథమికంగా నిరూపణ.