ఏపీ వ్యాప్తంగా ఈ రోజు బుధవారం జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానున్నది.తాడేపల్లిగూడెంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆన్ లైన్లో ప్రారంభించనున్నారు..
షాపులున్న రజకులకు,నాయీ బ్రాహ్మణులకు,టైలర్లకు ఏడాదికి రూ.పది వేల చొప్పున అందజేయనున్నారు.
ఇందులో భాగంగా తొలివిడతగా 2,47,040మంది లబ్ధిదారులకు అందజేయనున్నారు.ఇందుకు రూ.247.40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది..