ఏపీలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి అవినీతికి చోటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు..
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పించన్ అందాలని ఆదేశించారు.ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా రేషన్ కార్డులను తొలగించవద్దు.
దరఖాస్తులను తిరస్కరించవద్దు అని సూచించారు .తొమ్మిది నెలల్లోనే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చామని ఆయన అన్నారు..