ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే.
దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా చేశాము.
అందులో తాము ఉన్నామని ఆయన అన్నారు.అయితే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమని ఆయన మరోక ప్రశ్నకు బదులిచ్చారు..