కేంద్ర మాజీ మంత్రి అర్జున్ చరణ్ సేథీ(78) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
2000-2004 మధ్య వాజ్‌పేయ్ ప్రభుత్వంలో జలవనరుల శాఖ మంత్రిగా అర్జున్ చరణ్ సేథీ సేవలందించారు. 1971లో భద్రక్ లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
1980, 1991, 1998, 1999, 2004, 2009 ఎన్నికల్లో అర్జున్ చరణ్ సేథీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో బీజేడీని వీడి భాజపాలో చేరారు.