భారత్ దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో తొమ్మిది వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దీంతో కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 9,971కేసులు నమోదు అయ్యాయి.దీంతో మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,46,628 కేసులు నమోదయ్యాయి.
స్పెయిన్ దాటి ఐదో స్థానంలో నిలిచిందని జాన్ హప్ కీన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.ప్రస్తుతం అమెరికా,రష్యా,బ్రెజిల్,యూకే మొదటి స్థానంలో ఉన్నాయి.మరోవైపు కరోన కేసుల నమోదులో ఐదోస్థానంలో నిలిచిన భారత్ మృతుల కేసుల్లో పన్నెండోస్థానంలో నిలిచింది.