Home / MOVIES / మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!

మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!

సోషల్‌ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా పేర్కొంది.

ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. “మేడమ్, ఈ విషయాన్ని పరిశీలించాలని నేను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ను కోరాను. మీ ఫిర్యాదుపై చట్టాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకోవాలని వారికి సూచించాను” అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై మీరా చోప్రా స్పందిస్తూ..”థాంక్స్ సర్… మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి” అంటూ ట్వీట్ చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat