ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా సాయంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి ఇటీవల తనకు అందించిన రూ.2 లక్షల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయం లో బుధవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావుకి అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ఖజానాని సైతం లెక్క చేయక, ప్రజల ప్రాణాలే ముఖ్యమని అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. లాక్ డౌన్ సహా, రైతులు, కూలీలు, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ దశలో అనేక మంది సిఎంకి తమ వంతు విరాళాలిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. అందులో చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు మందడి లక్ష్మీ నరసింహా రెడ్డి విరాళం ఇవ్వడాన్ని మంత్రి ఎర్రబెల్లితోపాటు, మంత్రి కెటిఆర్,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి లు అభినందించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మెన్ మందడి లక్ష్మీనరసింహ రెడ్డి అందించిన రూ.2 లక్షల విరాళం చెక్కుని ఎమ్మెల్సీ @PSReddyTRS తో కలిసి మాసబ్ ట్యాంక్ లోని MA & UD కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఐటీ,శాఖ మంత్రి @KTRTRS అందచేసిన @DayakarRao2019. pic.twitter.com/Wb6WtgVTds
— Errabelli DayakarRao (@DayakarRao2019) June 3, 2020