దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘ సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని తెలిపింది. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రుల ప్రజాదారణపై ఓ నివేదికను విడుదల చేసింది.
ముఖ్యమంత్రులపై ‘సీ ఓటర్’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దేశ వ్యాప్తంగా టాప్-5 సీఎంల జాబితాలో చోటు దక్కింది. ప్రభుత్వ నిర్ణయాలు, పనితీరు ఆధారంగా ఈ సర్వే రూపొందించగా.. సీఎం జగన్‌కు 78.1శాతం మంది ప్రజల మద్దతు లభించింది. నాలుగో స్థానంలో సీఎం జగన్ చోటు దక్కించుకున్నారని సీ ఓటర్ సర్వే నివేదికలో తెలిపింది.
పాపులర్ సీఎంల జాబితాలో 4వ స్థానంలో సీఎం వైయస్ జగన్#APCMYSJagan pic.twitter.com/9QyAYkTvDA
— YSR Congress Party (@YSRCParty) June 2, 2020
కాగా.. ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ మఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఉన్నారు. ఇక జగన్ తర్వాత ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు నిలిచారు.