ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో ఉద్యమం లాగా పాల్గొనాలని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహించు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉద్యమ స్ఫూర్తి గా పాల్గొని డ్రైవ్ ను విజయవంతం చేయాలన్నారు. గత 70 రోజులుగా కరోనా వైరస్ ప్రజలకు విస్మయానికి గురిచేసిందని, లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని దీన్ని అధిగమించేందుకు కరోనా వైరస్ తో సహజీవనం చేస్తూనే పోరాటం చేయవలసి ఉందన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు,” విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఎవరి ఇళ్లలో వారు తమ తమ ఇళ్లలోని కూలర్లు, కొబ్బరి బొండం, కుండీలలో, పాత్రలలో, డ్రమ్ముల లో, పరిసరా లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. లార్వా దశలోనే దోమలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం వలన దోమలు పునరుత్పత్తి చెందకుండా వ్యాధులను నివారించవచ్చు అన్నారు.
సోఫీ నగర్ చెరువు ఆక్రమణకు గురైనట్లు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. చెరువు సర్వే చేయాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా చెరువులను, శిఖం భూములను కాపాడవలసిన బాధ్యత అధికారులదే నన్నారు. సోఫీ నగర్ లో లెవెల్ ప్రాంతం లో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కచ్చ డ్రెయిన్ ఏర్పాటు చేయడం జరిగిందని రాబోయే మున్సిపల్ బడ్జెట్ లో నిధులు కేటాయించి పక్కా డ్రైనేజ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. లేఅవుట్ లేకుండా ఫ్లాట్ లను చేయవద్దని, లే అవుట్ లో రహదారి, విద్యుత్, త్రాగునీరు లైన్ లు ఉన్నప్పుడే ఫ్లాట్ ల ఏర్పాటుకు అనుమతి పొందిలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం జూన్ 30 వరకు లాక్ డౌన్ విధించిడం జరిగిందని రాత్రి తొమ్మిది నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు పైబడినవారు బయటికి రా వద్దన్నారు. సామాజిక దూరం పాటించాలని, మాస్కూలు ధరించాలని, శానిటైజర్ వినియోగించాలని ప్రతి ఒక్కరూ ప్రతి పరిశుభ్రత పాటించాలన్నారు.