బహరేన్లో గుండె పోటు తో మరణించిన తెలంగాణ బిడ్డ ఎడ్ల గంగరాజాం మృతదేహాన్ని లాక్ డౌన్ లోను స్వగ్రామానికి పంపిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ .
పొట్టకూటి కోసం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేట్ గ్రామానికి చెందిన ఎడ్ల గంగరాజం మూడేళ్ల క్రితం అరబ్ దేశం బెహ్రైన్ లో ప్రైవేట్ కంపెనీలో చేరాడు. దురదృష్టవశాత్తు 14 ఏప్రిల్ 2020 తేదీన గుండె పోటుతో రూములో మృతి చెందినాడు. అకాల మరణం చెందిన గంగా రాజాం కు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దేశంకాని దేశంలో ప్రత్యేక పరిస్థితుల్లో ప్రాణం కోల్పోవటం తో కుటుంబం ఆధారం కోల్పోయింది.
సాధారణ పరిస్థితుల్లోనే అరబ్ దేశాల్లో చనిపోయిన వారి డెడ్ బాడీ తరలింపు ఎంతో కష్టం. అలాంటిది ప్రపంచాన్ని కరోనా వనికిస్తుండటంతో ప్రపంచమంతా లాక్ డౌన్ తో పాటు విమాన సర్వీసులు నిలిచిపోవడం తో ఏప్రిల్ 14న గంగరాజాం చనిపోయినా అతని కుటుంబం దయనీయ పరిస్థితులు, లాక్ డౌన్ నేపథ్యంలో గంగరాజం మృత్యువు ఎదుర్కొంది. దీంతో బహ్రెయిన్ లో తోటి సన్నిహితులు మగ్గిడి రాజేందర్ ఎన్నారై శాఖకు సమాచారం అందించటంతో వెంటనే స్పందించిన ప్రెసిడెంట్ సతీష్ కుమార్ రాధారపు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి గార్లకు తెలుపడం తో వెంటనే స్పందించి వెంకటేష్, అతని కంపెనీ యజమాని / అధికారులతో మాట్లాడారు. కంపెనీ పూర్తి సహకారంతో వారి పార్తివ దేహాన్ని (తేదీ 10.05.20 మధ్యాహ్నం ఎమిరేట్స్ కార్గో ప్లయిట్ నెం. EK9275 ద్వారా బహరేన్ నుండి బయలు దేరి 11.05.20 సోమావారం రాత్రి 09:15గం: లకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వారి స్వగ్రామం రాఘవపేట్ వరకు ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్సుసౌకర్యం కల్పిచడం జరిగింది. ఎడ్ల గంగరాజం వారి మృతదేహం లాక్ డౌన్ కూడా లో బహరేన్ నుండి తెలంగాణ కు చేరుకోవడం ఇదే మొదటి సరి. మృతదేహం స్వదేశానికి రావడానికి అవసరమైన ఏర్పాట్లు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల, ఎన్నారై శాఖ అధికారి చిట్టి బాబు గార్లు అన్ని విధాలా కృషి చేసారు. మరియు గంగరాజాం పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఎన్నారై టీఆరెస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ ,వైస్ ప్రెసిడెంట్ బొలిశెట్టి వెంకటేష్ ,జనరల్ సెక్రటరీ పుప్పాల లింబాద్రి, మగ్గిడిరాజేందర్, సెక్రటరీ చెన్నమనేని రాజేందర్ రావు , బాల్కొండ దేవన్న , ఉత్కం కిరణ్ కుమార్,ఆకుల సుధాకర్ జాయింట్ సెక్రటరీ బొలిశెట్టిప్రమోద్ , తమ్మళ్లవెంకటేష్ , కొత్తూరుసాయన్న ,కుమ్మరి రాజు కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నల్ల శంకర్,చిన్నవేన బాజన్న ,కోట నడిపి సాయన్న, ఆకుల చిన్న బుచ్చయ్య, సొన్న గంగాధర్, తప్పి చిన్న గంగారాం, మొహమ్మెద్. తదితరులు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు.