కేరళ ప్రభుత్వం హోం క్వారంటైన్ గైడ్ లైన్స్ లో సవరణలు చేసింది. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో అనుమానిత లక్షణాలున్నవారుంటే..వాళ్లు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నిర్ణయించింది.
విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఆస్పత్రిలో చేరాల్సిందేనని కేరళ వైద్యారోగ్య శాఖ మంత్రి కేకే శైలజ పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఉన్నతాధికారులు, పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.