ఇటీవల బాలీవుడ్‌లో ఇద్దరు లెజెండ్స్ కన్నుమూయగా, వారి మరణం చిత్ర పరిశ్రమకి తీరనిలోటుగానే ఉంటుంది. ఇక మలయాళ పరిశ్రమలోను రీసెంట్‌గా ఓ మలయాళ నటుడు కారు ప్రమాదంలో కన్నుమూసాడు. ఈ విషాదం మరచిపోక ముందే మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్(30) హఠాన్మరణం చెందారు. అంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది.
జిబిత్ దర్శకుడిగా రాణించాలని ఎన్నో కలలు కన్నారు. కాని ఆ కలలు అన్నిఆవిరయ్యాయి. ఆయన తొలి చిత్రం కొజిప్పోర్ . ఈ మూవీని లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందే అంటే మార్చ్ 6న విడుదల చేశారు. కానీ కేరళలో మార్చ్ 11 నుంచి లాక్‌డౌన్ విధించడంతో ఆ సినిమాకి అంత ఆదరణ లభించలేదు.
లాక్‌డౌన్ పూర్తయ్యాక ఈ సినిమాని మళ్ళీ విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. జిబిత్ మరణానికి మలయాళ సినీ పరిశ్రమ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధించారు.