కరోనా సంక్షోభంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. రోజువారి ఉపాధి లేని వారు కడుపు నింపుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
అయితే ఈ కరోనా సమయంలోను తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులని నిర్వహిస్తున్నజర్నలిస్ట్‌లు కూడా కొంత ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన కమల్ వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
కరోనా వైరస్ కొందరి జర్నలిస్ట్‌లపై కూడా పంజా విసిరింది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వారిలో ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున 40 మంది జర్నలిస్టులకు 6 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాడు కమల్ హాసన్.
ఈయన సాయం పట్ల తమిళనాడు రాష్ట్రంలో జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇటీవల ఓ జర్నలిస్ట్ తన తల్లి ఆసుపత్రి బిల్ కట్టలేని పరిస్థితులో ఉండగా, తానే కడతానని లారెన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.