డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు.
టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు ఫాలో అవ్వాల్సిందే. ట్రక్కులు, వస్తువుల రవాణా వాహనాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదని కూడా కేంద్ర హోం శాఖ తెలిపింది.
తన నివాసంలో ప్రధాని మోదీ నేడు కేంద్ర మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రైళ్ల ద్వారా కార్మికుల తరలింపుపై నిర్ణయం వెలువడిందని భావిస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణా నుంచి 12వందల మందితో ప్రత్యేక రైలు జార్ఖండ్ బయలుదేరింది. మరో రైలు కేరళ నుంచి ఒడిశాకు వెళ్లనుంది.దేశంలో ప్రస్తుతం లాక్‌డౌన్ రెండో దశ కొనసాగుతోంది.