కరోనా వచ్చిన రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు రాజకీయాలు పక్కనపెట్టి అత్యంత భాద్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వేలకోట్ల ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యమని లాక్ డౌన్ ను తు చ తప్పకుండా పాటిస్తున్నాం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రధాన మంత్రిని విమర్శిస్తుంటే ఇప్పుడు రాజకీయం చేయవద్దని వారించిన వ్యక్తి మన సిఎం గారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాజకీయాలకు,కులాలకు,మతాలకు,ప్రాంతాలకు సంభందం లేకుద ఈ విపత్తుని కలిసికట్టుగా ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు.
మేం ఇంత విశాల దృక్పదo తో ఆలోచిస్తుంటే కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం మాట్లాడుతున్నారు, పరీక్షలు తక్కువ చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గుడ్డిఎద్దు చేలో పడ్డట్టు టెస్ట్స్ చేయరు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా మాత్రమే చేయాలి అనేవిషయం తెలుసుకోవాలి. భాద్యత లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడకండి ప్రజలు గౌరవించరు అని మంత్రి అన్నారు. ఎన్ని పరీక్షలు చేశాం కాదు ఎంత ఖచ్చితత్వంతో చేస్తున్నామన్నది ముఖ్యం అని పాజిటివ్ కేసులు వచ్చిన సందర్భంలో ట్రాక్ అండ్ ట్రీట్మెంట్ అనేది ప్రధానం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు.
కేంద్ర బృందం హైదరాబాద్ లో పర్యటించి గచ్చిబౌలీ చూసి అబ్బురపడింది, గాంధీలో జరుగుతున్న చికిత్స పట్ల హర్షం వ్యక్తం చేసింది. కేంద్ర హోమ్ శాఖ సహాయ కార్యదర్శి గొప్పగా చెప్పారు. ఇది చూసి జీర్ణించుకోలేని స్థానిక బిజేపి నేతలు నిజమా కాదా అని కేంద్ర బృందం దగ్గరికి వెళ్ళి ఆరా తీయడం సిగ్గుచేటు. అంటే కరోనా పోవద్దని బిజేపి వారు అనుకుంటున్నారా అని మంత్రి అన్నారు, సంతోషించాల్సింది పోయి కాళ్ళలో కట్టెలు పెడుతున్నారని అన్నారు. ఈ మత రాజకీయాలు తెలంగాణలో చెల్లవు అని మంత్రి అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంటే ఢిల్లీ లో సమావేశాలకు అనుమతి ఇచ్చింది మీరే అనే విషయం మరచిపోవద్దు అని అన్నారు. ఇండోనేషియా వాళ్ళు ఢిల్లీ వచ్చి అక్కడినుండి కరీంనగర్ వస్తే వారిని గుర్తించి కరోనా మూలాన్ని దేశానికి తెలియజేసిన రాష్ట్రం తెలంగాణ అని, 1244 మందిని వారితో కలిసిన పదివేల మందికి పరీక్షలు చేసి కరోనాను కట్టడి చేశామని అన్నారు. జిమ్మెదారితో, తపనతో పనిచేస్తున్నామని సిఎం గారి ఆదేశాలతో రాష్ట్రంలో యంత్రాంగం అంతా కరోనా కట్టడికి పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలుకూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారని ఇది జీర్ణించుకోలేని కొంతమంది విమర్శలు చేస్తున్నారని అన్నారు.
కరోనా పాజిటివ్ కేసులు,జరిగే మరణాలు దాస్తే దాగవు అని అలా చేసిన దేశాలు మూల్యం చెల్లించుకున్నాయి అని మంత్రి తెలిపారు. సిఎం గారి ఆదేశాలతో గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో వైరస్ వ్యాప్తి నిరోదించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల బాగు కోసం అన్నీ చర్యలు తీసుకుంటుందని, ప్రజలకు తమపై పూర్తి నమ్మకం ఉంది అని మంత్రి అన్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే కింగ్ కోటి హాస్పిటల్ కి రావాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.
ఈరోజు 6 పాజిటివ్ కేసులు రాగా మొత్తం 1044 కి చేరుకున్నాయి.
22 మంది డిశ్చార్జ్ అవ్వగా మొత్తం 464 మంది కొలుకున్నారు. ఇప్పటివరకు 28 మంది మరణించారు. ప్రస్తుతం 552 మంది గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి వివరించారు.