గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను రాష్ట్రానికి చేరుస్తున్న ఏపీ ప్రభుత్వం.
* గురువారం రాత్రి గుజరాత్ నుంచి బస్సుల్లో హైదరాబాద్ చేరుకున్న మత్స్యకారులు.
*రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో ఎల్బీనగర్ లో బోజనాలను ఏర్పాటు చేసిన చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి గారు
గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన 1100 మంది మత్స్యకారులు సీఎం జగన్ చొరవతో తిరిగి వస్తున్నారు.. రాత్రి తెలంగాణలో అడుగు పెట్టారు.. బస్సుల్లో నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నారు.. హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద చైతన్య పురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, మన్సూరా బాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి లు మత్స్యకారులకు భోజనం సదుపాయాలు ఏర్పాటు చేశారు.
మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలపై రాత్రి 8 గంటల నుంచి బోజనాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ 35 రోజుల పాటు తామంతా నరకం అనుభవించామని సీఎం జగన్మోహన్ రెడ్డి వల్ల తమకు విముక్తి లభించిందని హర్షం వ్యక్తం చేశారు.. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యామని తమ ఊళ్ళకు కుటుంబాల వద్దకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉందంటున్న మత్స్యకారులు తెలిపారు