లేబర్ డే… కార్మిక దినోత్సవం.. కానీ మహమ్మారి కరోనా.. కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో శ్రామిక వర్గం తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నది. వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను అక్కున చేర్చుకున్నది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించింది.
సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి లోటు రాకుండా చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో.. స్వంత ఊళ్లకు వెళ్లాలనుకునే వలసకూలీలకు రెండు రోజుల క్రితమే కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తే.. కూలీలు వెళ్లిపోవచ్చు అన్న సంకేతాన్ని వినిపించింది.
వలస కూలీలను రాష్ట్ర వికాస ప్రతినిధులుగా భావించిన తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించింది. సంగారెడ్డిలో ఉంటున్న కార్మికులను ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసింది.