దేశంలో కరోనా కేసుల సంఖ్య 30 వేల మార్కును దాటి 30,200కి చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువైంది. మంగళవారం నాటికి ఈ సంఖ్య 947గా ఉన్నది.
8,500 వైరస్ కేసులు, 369 మరణాలతో మహారాష్ట్ర టాప్లో ఉండగా, 3,700 కేసులతో గుజరాత్, 3,100 కేసులతో ఢిల్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో కేసుల సంఖ్య 2 వేలు దాటాయి.
తమిళనాడులో మంగళవారం కొత్తగా 121 కేసులు నమోదుకాగా, అందులో ఐదు రోజుల శిశువు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.