కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న భారతదేశంలో ఒక్కో రాష్ట్రం కరోనాను తరిమికొట్టడంలో విజయవంతంమవుతున్నాయి. త్రిపుర కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రెండో పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి కోలుకున్న తర్వాత కరోనా కేసులు లేని రాష్ట్రంగా మారిందన్నారు.
త్రిపురలో తొలుత రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి వ్యక్తికి ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించిన తర్వాత మళ్లీ పరీక్ష చేస్తే నెగెటివ్ వచ్చింది.
ఇపుడు రెండో వ్యక్తికి కూడా నెగెటివ్ రావడంతో అన్ని డిశ్చార్జ్ చేశామని సీఎం విప్లవ్ కుమార్ దేవ్ వెల్లడించారు. ఇటీవల గోవా రాష్ట్రం కరోనా కేసులు లేని రాష్ట్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.