మేడ్చల్ జిల్లాలో ఆరునెలల చిన్నారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మకాలనీ పేజ్-3లో ఓ క్యాబ్ డ్రైవర్ కుటుంబం నివాసముంటున్నది.
ఆరునెలల తన కుమార్తెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సదరు క్యాబ్ డ్రైవర్ ఈ నెల 8న హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తీసుకెళ్లారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. వెంటనే పాపను గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.