కరోనా మహమ్మారి కారణంగా సినీ కార్మికుల కష్టాలను తీర్చేందుకు టాలీవుడ్‌లో సీసీసీని చిరంజీవి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దీనికి సెలబ్రిటీలందరూ విరాళం ప్రకటిస్తూ వారి ఉదారతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర సినీ ఇండస్ట్రీలలో కూడా పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు అక్కడి ఫెడరేషన్ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హీరోయిన్ కంగనా రనౌత్ రూ. 10 లక్షల విరాళం ప్రకటించి తన గొప్పమనసును చాటుకున్నారు. ఈ రూ. 10 లక్షలలో రూ. 5 లక్షలు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ)కి, మరో రూ. 5 లక్షలు ప్రస్తుతం తను చేస్తున్న ‘తలైవి’ చిత్రం కోసం పనిచేస్తున్న కార్మికులకు ఆమె విరాళంగా అందించారు.