తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది.
ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయా సంఘాల ప్రతినిధులు తెలిపారు.