దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు.
దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారావిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 168కి చేరగా.. ఇప్పటి వరకూ అక్కడ 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
సోమవారం ముంబైలో కరోనా వల్ల ఏడుగురు చనిపోయారు. దీంతో ముంబైలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 138కి చేరింది. ముంబైలో సోమవారం గుర్తించిన కరోనా బాధితుల్లో 53 మంది జర్నలిస్టులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.