కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి.
వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే… వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది.
అలాగే క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బందితో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉండే వారికి కూడా తెలిసిపోతుంది. దీంతో క్షణాల వ్యవధిలోనే సంబంధిత వ్యక్తిని బయటకు వెళ్లకుండా కట్టడి చేయనున్నారు. అలాగే కరోనా పాజిటివ్ వచ్చిన వారు, వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ఇతరులకు వ్యాపించకుండా కృషి చేస్తున్నారు.