మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో…తమ స్వ రాష్ట్రాల కు కాలి నడకన వెలుతున్న వలస కార్మికులు.రోడ్డు పై పిల్లలతో నడుచుకుంటూ వెళుతున్న వారిని చూసి కారు ఆపి పరామర్శించిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని, పని, ఆహారంలేదని ..ఈకారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు చెప్పిన వలస కార్మికులు.వారి మాటలకు చలించిపోయిన మంత్రి.
లాక్‌డౌన్ నేపధ్యంలోఎక్కడికి వెళ్లవద్దని…మనోహరాబాద్ లోనే ఆశ్రయం కల్పిస్తానని చెప్పిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు.ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాష్ట్రాలకు వెళతామన్న కార్మికులు.
పిల్లలతో కాలినడకన వెళ్లడం శ్రేయస్కరం కాదని…ఇక్కడే ఉండాలని నచ్చచెప్పడంతో అంగీకరించిన వలస కార్మికులు.
స్థానికంగా ఉండేందుకు అన్ని రకాలుగా సాయం అందిస్తానని వారికి హామీ ఇవ్వడంతో ఆనందంవ్యక్తం చేసిన వలస కార్మికులు