మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుదైన రికార్డును సంపాందించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఇరవై ఐదు రోజుల పాటు మంత్రి వర్గం ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుగాంచారు.
అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప పేరు మీద ఈ రికార్డు ఉంది.యడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు.
అయితే వీరిద్దరూ ఫిరాయింపులదారుల సహాకారంతోనే నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపించారు.