తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నియమనిబంధనలను అతిక్రమిస్తే కేసులే అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.
రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలోని ప్రాంతాలపై అధికారులతో కల్సి మంత్రి కేటీరామారావు సమీక్షించారు.కంటైన్ మెంట్ల జోన్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
కంటైన్ మెంట్ల ప్రాంతాల్లో నియమాలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు.ఈ ప్రాంతాల్లో ఉన్నవారికి నిత్యవసర వస్తువులను ఇంటికే సరఫరా చేసేలా ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 246కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.ఒక్క హైదరాబాద్లోనే 146ఉన్నాయి.