ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు చెలరేగిపోతుంది.ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది.
పది లక్షల జనాభాకుగాను ఏపీ 331మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 16,555పరీక్షలు చేసింది.ఈ జాబితాలో రాజస్థాన్ (549),కేరళ (485),మహారాష్ట్ర (446)లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
అయితే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని పొందుపరచలేదు.ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 572కి చేరుకుంది.