ఏప్రిల్-20 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసి.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించి మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.
ఈ సందర్భంగా సడలింపుపై మాట్లాడిన ఆయన.. ఏప్రిల్-20 తర్వాత ఒకవేళ కరోనా కేసు ఒక్కటి పెరిగినా అన్ని మినహాయింపులు తీసేస్తామని ప్రధాని ప్రకటించారు. దేశంలో ప్రతి కరోనా హాట్‌స్పాట్‌పై ఫోకస్ పెట్టామన్నారు.
అందుకే మనమందరం కరోనా కట్టడికి జాగ్రత్తతో ఉండాలని సూచించారు. లాక్‌డౌన్‌తో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మోదీ భరోసా ఇచ్చారు. మే-03 వరకు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ఆయన సూచించారు. లాక్‌డౌన్‌పై రేపు గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రధాని తెలిపారు.