యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రతీ భారతీయుడు పాటించాల్సిన ఏడు సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు.
ఏడు సూత్రాలు ఆయన మాటల్లోనే..
1.మీ ఇంట్లో ఉన్న వృద్ధులను జాగ్రత్తగా చూసుకొండి. ముఖ్యంగా అంతుకు ముందే ఏదైనా అరోగ్య సమస్య ఉన్న వాళ్ల విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. వాళ్లకి కరోనా సోకకుండా కాపాడుకోవాలి.
2.లాక్‌డౌన్ మరియు వ్యక్తిగత దూరంకి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఇంట్లో తయారు చేసిన మాస్కులను ఉపయోగించండి.
3.మీ రోగ నిరోధక శక్తి పెంచుకొనేందుకు ఆరోగ్యశాఖ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించండి.
4.కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అందరు ‘అరోగ్య సేతు’ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్లని కూడా డౌన్‌లోడ్ చేసుకోమని సూచించండి.
5.మీకు సాధ్యమైనంత వరకు.. పేదలకు సహాయం చేయండి. వాళ్ల ఆకలి కష్టాలు తీర్చే ప్రయత్నం చేయండి.
6.మీకు పని చేస్తున్న చోట.. మీ తోటి ఉద్యోగుల పట్ల కరుణ, దయ చూపించండి. ఏ కంపెనీ కూడా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు.
7.దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను గౌరవించండి.
అని మోదీ తెలిపారు. ఈ ఏడు సూత్రలులను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపిన ఆయన.. ఈ సప్తపది విజయాన్ని అందించే మార్గం అని అన్నారు. విజయం సాధించేందుకు మనం నిష్టగా చేయాల్సిన పనులు ఇవి అని పేర్కొన్నారు. లాక్‌డౌన్ ముగిసేవరకూ ప్రభుత్వం విధించిన నిబంధనలకు నిష్టగా పాటించాలని చెప్పి.. ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.