కరోనా కారణంగా చెడే కాదు మంచి కూడా జరుగుతుంది. పాత కాలం నాటి పద్దతులు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో అప్పటి వారు తెగ సంతోషిస్తున్నారు. అయితే కరోనా అనేది ముఖ్యంగా చేతులు కలపడంతో వస్తుందని, ఎవరైన కలిసినప్పుడు విష్ చేసేందుకు చేతులు కలపడంకి బదులుగా నమస్తే పెట్టాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు చెబుతూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హీరో పోలీస్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయనపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు.
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఓ పోలీసుకు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోపై నెటిజన్స్ హీరో అయి ఉండి నిబంధనలు తుంగలో తొక్కుతావా అంటూ ఫైర్ అయ్యారు.
మాస్క్ కట్టుకోలేదు, గ్లవ్స్ ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు, పైగా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అతని ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నావు అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన వరుణ్ తేజ్ .. ఇడియట్, అది రెండు నెలల క్రితం దిగిన ఫోటో, లవ్ యూ అని రిప్లై ఇచ్చాడు .