ప్రస్తుతం గజగజవణిస్తున్న కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతన్నలకు అండగా ఉందామని హాట్ అండ్ బ్యూటీ యాంకర్ అనసూయ పిలుపునిచ్చింది.
అనసూయ తన ఇన్ స్టాగ్రమ్ లో రైతులను ఉద్ధేశిస్తూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఆ వీడియోలో ” రైతు దేశానికి వెన్నుముక..రైతు లేనిదే మనుగడ లేదు.కరోనా దాడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలుద్దాం.మామిడి,అరటి ,బత్తాయి,నిమ్మ,జామ కాయలను కొనుక్కుందాం..
పండ్లను తిందాం..రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం..ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.రైతుకు మనం అవసరం..మనకు రైతు అవసరం..రైతులను కాపాడుకుందాం .అది మనందరి బాధ్యత అంటూ ఆ వీడియోను పోస్టు చేసింది.