కరోనా వైరస్ మహమ్మారి ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా ప్రపం చం, దేశం, తెలంగాణలోనూ వ్యాప్తి చెందుతున్నదని, ప్రజలు ఇంతకుముందుకంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తిచేశారు. అప్రమత్తతే కొవిడ్ కట్టడికి ఆయుధమని పేర్కొన్నారు.
కొవిడ్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకినవారికి అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి 9.30 గంటలవరకు సాగిన ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఇద్దరు చనిపోయారని తెలిపారు. చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురు కోలుకొని డిశ్చార్జి అయినట్టు చెప్పారు.
దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 531కి, మరణించినవారి సంఖ్య 16కు, డిశ్చార్జి అయినవారి సంఖ్య 103కు చేరినట్టు వివరించారు. మిగతా 412 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో పరిణామాలను గమనిస్తుంటే కరోనా వైరస్ వ్యాప్తి ఆగడంలేదని స్పష్టమవుతుంది.