కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎంవీ రాజశేఖరన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల వయసున్న రాజశేఖరన్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సారధ్యంలోని కాంగ్రెస్ కేంద్ర సర్కారులో కేంద్ర ప్రణాళిక శాఖ సహాయమంత్రిగా పనిచేసిన రాజశేఖరన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
రాజశేఖరన్ మృతి పట్ల కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలిపారు. రాజకీయాల్లో విలువలు గల నేత అయిన రాజశేఖరన్ గ్రామీణాభివృద్ధి కోసం ఓ సంస్థను స్థాపించారని సీఎం పేర్కొన్నారు.. రాజశేఖరన్ మృతి పట్ల పలువురు నేతలు తమ ప్రగాఢ సంతావం తెలిపారు.