ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) గా జస్టిస్ కనగ రాజు నియమితులయ్యారు.
జస్టిస్ కనగరాజు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.
ఎస్ఈసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం ముగిసింది.